![]() |
![]() |
.webp)
సెలబ్రిటీల డ్రెస్ లు, అడ్సెస్ లు వాటి కాస్ట్ తెలుసుకుంటే దిమ్మతిరిగిపోతుంది. విలువైనవి ధరిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంటారు. కొందరు బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర సెలబ్రిటీలుండగా బిగ్ బాస్ నుండి వచ్చినవారు కూడా సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. సీజన్ సెవెన్ లో గ్లామర్ పరంగా హౌస్ లో ఎక్కువ పాపులర్ అయిన సెలబ్రిటీ రతికరోజ్.
రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు 'బేబీ' సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. అయితే రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక హౌస్ లో తన గ్లామర్ కి ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారు. హౌస్ నుండి బయటకొచ్చాక రతిక ఓ సందర్భంలో పల్లవి ప్రశాంత్ తో ఓ బాండింగ్ ఉందని చెప్పింది. ఇక తాజాగా మొదలైన బిబి మహోత్సవంలో తన సింగింగ్ ట్యాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక బిబి మహోత్సవంలో వీరి హంగామాకి ఫ్యాన్ బేస్ పెరిగింది.
ఇన్ స్ట్రాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోస్, రీల్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది రతికరోజ్. తాజాగా వైట్ డ్రెస్ లో ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఈకలతో కూడిన టాప్ ని ధరించి అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది. అయితే ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దానికి కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్.. బిగ్ బాస్ హౌస్ లో నిన్ను తప్ప ఎవరిని చూడలేదు.. అదేంటి ఏంజిల్స్ ఇన్ స్ట్రాగ్రామ్ కూడా వాడతారా.. గార్జియెస్, జగన్ అన్న ఇస్తాడు అమ్మ ఒడి, నీకోసం కడతా గుండెల్లో గుడి, మిల్క్ బ్యూటీ లాంటి కామెంట్లతో నెటిజన్లు చేస్తుండగా.. రతిక మాత్రం పాజిటివ్ గా కామెంట్ చేసినవారికి రెస్పాన్స్ ఇస్తుంది.
![]() |
![]() |